![]() |
![]() |
.webp)
జీ కుటుంబం 2025 అవార్డ్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ప్రోమోలో "తెలుసు కదా" మూవీ టీమ్ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే సీరియల్స్ నుంచి కొంతమంది లేడీ యాక్టర్స్ కూడా వచ్చారు. డిజె టిల్లు మూవీలో రాధికా రోల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఈ అవార్డ్స్ ఈవెంట్ కూడా రాధికా రోల్ మీదనే నడిచింది. ఈ షోకి హోస్ట్స్ గా ప్రదీప్, శ్రీముఖి ఉన్నారు. "మా ప్రతీ సీరియల్ లోనూ ఒక రాధికా ఉంటుంది" అని ప్రదీప్ అనేసరికి. "రాధికా లైఫ్ లోనే ఉంటుంది సర్" అన్నాడు సిద్దు. "నాకు లైఫ్ అప్పుడప్పుడు రాధికలా ఉంటుంది" అన్నాడు ప్రదీప్. "ఇప్పుడు మీ ముందుకు కొంతమందిని ప్రెజెంట్ చేస్తాను. వాళ్లలో రాధికా ఎవరో చెప్పాలి" అన్నాడు ప్రదీప్. "మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రెస్సింగ్ ని బట్టి రాధికా తెలిసిపోతుంది" అంటూ శ్రీముఖి చెప్పింది. "నీ గోల ఏంటి మధ్యలో.." అంటూ శ్రీముఖి మీద సిద్దు సెటైర్స్ వేసాడు.
ఆ యాక్టర్స్ లో ఒకమ్మాయిని చూసి రాధికా అని అన్నాడు సిద్దు. "రైట్ ఆన్సర్. వచ్చి హగ్ చేసుకో " అని శ్రీముఖి చెప్పేసరికి ప్రదీప్ వచ్చి "ఆయన ఏ డెసిషన్స్ లేవా" అని అడిగాడు. "అసలు రాధికా" అంటూ శ్రీముఖిని ఆటపట్టించాడు సిద్దు. సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ పేరుతో వచ్చిన మూవీస్ ద్వారా అందరికీ ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా సిద్దు, రాశి "తెలుసు కదా" అనే మూవీలో నటించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రతీ షోని విజిట్ చేస్తున్నారు. ఇక ఈ నెలలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |